INTERNET

కొత్తగా తెలుసుకునేవాళ్లకు ఇంటర్నెట్ స్పీడ్ గైడ్ - ఇంటర్నెట్ స్పీడ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతీదీ వివరించబడింది

Monday, Feb 28, 2022 · 40 mins

8294

ఇంటర్నెట్ స్పీడ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతీదీ

ఇంటర్నెట్

 

ఇంటర్‌నెట్ స్పీడ్స్ పై బిగినర్స్ గైడ్ - ఇంటర్‌నెట్ స్పీడ్స్ గురించి మీకు కావాల్సిన ప్రతి అంశాన్ని ఇక్కడ వివరించడం జరిగింది.

 

ఇంటర్నెట్ సేవలన్నీ మీరు పొందే స్పీడ్‌ను బట్టే ఉంటాయి. సెకనుకు మెగాబిట్‌ (Mbps), గిగాబిట్, ఫైబర్, బ్రాడ్‌బ్యాండ్‌ల వంటి క్లిష్టమైన వివరాలతో ఇంటర్నెట్ స్పీడ్ సమాచారం పొందడం చాలా సులభం. అందుకే మీరు ఇంటర్నెట్ స్పీడ్ గురించి తెలుసుకోవాల్సిన అంశాలపై మేము ఈ ఇంటర్నెట్ స్పీడ్ గైడ్‌ను రూపొందించాం.

 

ఇంటర్నెట్ స్పీడ్స్ మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తున్నట్లు అయితే, ఇకపై మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీ కోసం దిగువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మేం ప్రయత్నించి మీకు సహాయపడతాం.

 

ఇంటర్నెట్ స్పీడ్ అంటే ఏంటి?

 

·         ఇంటర్నెట్ స్పీడ్ టెస్టులు

·         అప్‌లోడ్ స్పీడ్ vs డౌన్‌లోడ్ స్పీడ్

·         బిట్స్ vs బైట్స్

·         బ్రాడ్‌బ్యాండ్‌లో రకాలు: ఫైబర్ vs కేబుల్ vs DSL బ్రాడ్‌బ్యాండ్

·         బ్రాండ్ విడ్త్, లేటెన్సీ

·         తక్కువ స్పీడ్‌కు కారణమయ్యే సమస్యలు, వాటిని ఎలా ఫిక్స్ చేయాలి

 

ఇంటర్నెట్ స్పీడ్ అంటే ఏంటి?

 

ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంటర్నెట్ ప్లాన్ ఆధారంగా మీకు కేటాయించిన బ్యాండ్‌విడ్త్. ఇది మీరు ఉపయోగించే డేటా. ఇది సెకన్లలో కొలవబడుతుంది. ఉదాహరణకు 10 Mbps అంటే మీరు సెకనుకు 10 మెగాబిట్స్ డేటాను పొందవచ్చు లేదా పంపవచ్చు.

 

ఇంటర్నెట్ స్పీడ్ టెస్టులు

మీరు ఎప్పుడైనా మీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్‌ను తనిఖీ చేసినట్లయితే మీరు ఊక్లా (Ookla) స్పీడ్ టెస్టును ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఊక్లా నెట్ ఇండెక్స్ Speedtest.net నుంచి సమాచారాన్ని తీసుకుని నిర్వహిస్తుంది. తద్వారా సులభంగా వాడుకునేలా చేస్తుంది.

 

"Go to my location" లింకును క్లిక్ చేయగానే మీరు మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న అన్ని ISPల జాబితా పేజీకి మళ్లించబడతారు. అందులో మీరు నిర్ధిష్టమైన సిటీ కోసం కూడా చూడవచ్చు. ISPలు అనేవి వారి చందాదారుల ఇటీవల కాలం నాటి Speedtest.net డౌన్‌లోడ్ వేగం ఫలితాల ఆధారంగా ర్యాంక్ చేయబడ్డాయి. ఇక్కడ వాస్తవానికి ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు స్పీడ్ అధికంగా ఇస్తున్నారో మీరు చూడవచ్చు. ఊక్లా స్పీడ్ టెస్ట్ వివిధ దేశాలు, ప్రాంతాలు, నగరాల మధ్య సగటు ఇంటర్నెట్ వేగాన్ని సరిపోల్చడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. అప్‌లోడ్ స్పీడ్, కనెక్షన్ నాణ్యత, ధర కోసం విలువ ఆధారంగా మీరు ర్యాంకింగ్‌లను తనిఖీ చేయవచ్చు.

 

 

అప్‌లోడ్ స్పీడ్ vs డౌన్‌లోడ్ స్పీడ్

 

అత్యంత విశ్వసనీయ స్పీడ్ టెస్ట్ ప్రొవైడర్లు మూడు ముఖ్యమైన ఇంటర్నెట్ అంశాలను కొలవడంతో పాటు నివేదిస్తారు. అవి ఏంటంటే అప్‌లోడ్ స్పీడ్, డౌన్‌లోడ్ స్పీడ్, పింగ్, లేటెన్సీ.

 

1.       డౌన్‌లోడ్ స్పీడ్:

 

డౌన్‌లోడ్ స్పీడ్‌ను ఫోటోలు, వీడియో ఫైళ్లు మొదలైన డేటాను స్వీకరించడానికి మీరు సెకనుకు వినియోగించే మెగాబిట్‌ల సంఖ్య ద్వారా కొలవవచ్చు. ఆన్‌లైన్‌లో ఆడియో వినడం, ఈమెయిల్ స్వీకరించడం, నెట్‌ఫ్లిక్స్ లేదా ప్రైమ్ వీడియో వంటి సర్వీసులను స్ట్రీమింగ్ చేయడం వంటి కార్యకలాపాలను డౌన్‌లోడ్‌గా పరిగణించవచ్చు. సాధారణంగా 25Mbps డౌన్‌లోడ్ స్పీడ్ వీడియోలను స్ట్రీమ్ చేయడం, వీడియో కాల్‌లలో పాల్గొనడం మొదలైన వాటికి అనువైనదిగా పరిగణించబడుతుంది.

 

2.       అప్‌లోడ్ స్పీడ్

అప్‌లోడ్ స్పీడ్ అనేది మీ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా మరో పరికరానికి మీరు పంపగల డేటా యొక్క మెగాబిట్‌ల సంఖ్యగా సూచించబడుతుంది. డౌన్ లోడ్ చేయడం గురించి అందరికీ బాగా తెలిసినప్పటికీ, అర్థం చేసుకున్నప్పటికీ డేటాను అప్‌లోడ్ చేయడం అనేది డౌన్‌లోడ్ చేయడానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈమెయిల్ పంపడం, వీడియో గేమ్ ఆడటం మొదలైనవాటి ద్వారా వాటిని అర్థం చేసుకోవచ్చు. ప్రజలు మీ వీడియో కాల్స్ బ్లర్ అవ్వడం చూసినప్పుడు, మీ అప్ లోడ్ స్పీడ్‌తో సమస్య ఉందని అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా 3Mbps అప్‌లోడ్ స్పీడ్‌ అనేది ఇంటి నుంచి పనిచేయడానికి, వీడియో కాలింగ్ చేసుకునేందుకు సరిపడినంత మంచి స్పీడ్‌గా పరిగణించబడుతుంది.

 

3.       పింగ్

 

పింగ్ అనేది ప్రతిస్పందన కోసం సర్వర్‌కు పంపే అభ్యర్థన. ఒకవేళ లభ్యం అయితే సర్వర్ ఒకే ప్యాకెట్‌లో ప్రతిస్పందనను తిరిగి పంపుతుంది. ఈ లావాదేవీ మిల్లీసెకన్‌లలో లెక్కించబడుతుంది. పింగ్ సమయం అనేది పరికరం ప్రతిస్పందనతో తిరిగి సర్కిల్ చుట్టేందుకు అభ్యర్థన ద్వారా పట్టే సమయం. ఒక అభ్యర్థనతో హోస్టును చేరడానికి, ప్రతిస్పందన పొందడానికి ఎంత సమయం పట్టిందా అని అర్థం చేసుకోవడానికి గేమర్లు పింగ్ టెస్టులను ఎక్కువగా ఉపయోగిస్తారు. పింగ్ సమయం ఎక్కువగా ఉంటే డేటా ట్రాన్స్‌ ఫర్‌లో మీరు అంత ఆలస్యాన్ని పొందుతారు.

 

4.       జిట్టర్

 

సాంకేతికంగా ఒక జిట్టర్ అనేది చోటుచేసుకునే జాప్యం (లేటెన్సీ)లోని వ్యత్యాసం. ఉదాహరణకు మీరు ప్లే చేస్తున్న సర్వర్‌లో సాధారణంగా 20 ms జాప్యాన్ని పొందవచ్చు. ఇది 20 msకు పడిపోవడానికి ముందు మీరు 70 ms లేదా 220 ms స్పైక్ లను పొందవచ్చు. 100 msల కంటే తక్కువ ఏదైనా గేమ్ ఆన్‌కు ఆమోదయోగ్యమైన జాప్యంగా పరిగణించబడుతుంది. అయితే, 25 msల కంటే తక్కువ లేటెన్సీని చాలా మంది ఆటగాళ్లు ఇష్టపడతారు.

 

బిట్స్ vs బైట్స్

 

స్పీడ్స్ ఆధారంగా ఇంటర్నెట్ కోసం చూడటంలో అన్ని పదాలు గందరగోళం చేసేవిగా ఉంటాయి. Mbps, MBps, kbps, Gbps. ఇవన్నీ అంటే ఏమిటి?

 

ఇవి సెకనుకు పంపబడుతున్న డేటా మొత్తాన్ని సూచిస్తాయి. వాటిలో ప్రతి దాని అర్థం ఇక్కడ ఉంది.

 

kbps – కిలో బైట్స్ పర్ సెకండ్. డయలప్ (ఉదాహరణకు 56k), తక్కువ స్పీడ్ DSL గురించి మాట్లాడేటప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

 

Mbps లేదా mbps – మెగాబిట్స్ పర్ సెకండ్. చాలా మంది దీన్ని మెగాబైట్లు అనుకొని గందరగోళానికి గురవుతారు. ఈ రెండింటి మధ్య తేడాపై "b" గురించి సంక్షిప్తంగా రాయబడింది;  Mbps = మెగాబిట్స్, MBps = మెగాబైట్స్.

 

MBps – మెగాబైట్స్ పర్ సెకండ్. మెగాబైట్స్ సాధారణంగా (రెసిడెన్షియల్) ఇంటర్నెట్ ప్లాన్‌లలో ఉపయోగించబడవు.

 

gbps – గిగాబైట్స్ పర్ సెకండ్. గిగాబైట్‌లను ప్రధానంగా భారీగా డేటా వినియోగించేవారు, చిన్న వ్యాపారాల వారు ఉపయోగిస్తారు.

 

బ్రాడ్‌బ్యాండ్ రకాలు: ఫైబర్ vs కేబుల్ vs DSL

 

డైరెక్ట్ సబ్‌స్క్రైబర్ లైన్ (DSL): 

DSL అనేది టెలిఫోన్ లైన్ల ద్వారా డేటాను పంపించే ఇంటర్నెట్ కనెక్షన్. టెలిఫోన్ లైన్లు రాగితో తయారు చేయబడతాయి. అయితే రాగి గొప్ప కండక్టర్ కావడంతో DSL కనెక్షన్ కేబుల్ లేదా ఫైబర్‌నెట్ ఇంటర్నెట్ కనెక్షన్ తరహాలో వేగంగా డేటాను తరలించదు. DSLపై మీ నిర్ణయాన్ని ప్రభావితం చేసే కీలకమైన అంశం ఏంటంటే.. మీ ఇల్లు, టెలిఫోన్ ప్రొవైడర్ కార్యాలయం మధ్య దూరం. దీని అర్థం మీరు మెయిన్ లైన్ నుంచి ఎంత దూరంలో ఉంటే సిగ్నల్ అంత బలహీనంగా ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ నెమ్మదిగా ఉంటుంది.

 

కేబుల్:

 

కేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్‌లు అనేవి టెలిఫోన్ లైన్‌ల ద్వారా నడుస్తాయి. ఇవి డేటాను పంపేందుకు ఏకాక్షక (కోఆక్సియల్) కేబుళ్లను ఉపయోగిస్తాయి. ఇవి డైరెక్ట్ సబ్‌స్క్రైబర్ లైన్ కనెక్షన్ కంటే ఎక్కువ బ్యాండ్‌విడ్త్ ను కలిగి ఉంటాయి. DSL తో పోల్చినప్పుడు కేబుల్ కనెక్షన్ కనెక్టివిటీ దూరం మీద ఆధారపడి ఉండదు. అయితే డెడికేటెడ్ టెలిఫోన్ లైన్ అయిన DSL కనెక్షన్ కాకుండా కేబుల్ కనెక్షన్‌లు సాధారణంగా వినియోగదారుల మధ్య భాగస్వామ్యం చేయబడతాయి. దీని అర్థం బ్యాండ్‌విడ్త్ వినియోగదారుల మధ్య విభజించబడింది. అంతేగాక, ఇది తక్కువ సురక్షితమైన ఎంపిక కూడా. స్పీడ్ పరంగా కేబుల్ కనెక్షన్‌లు DSL కంటే 3 నుంచి 4 రెట్లు వేగంగా ఉంటాయి. సాధారణంగా 10-50 Mbps వరకు వేగాన్ని అందిస్తాయి.

 

ఫైబర్‌నెట్:

 

ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అనేవి ఇంటర్నెట్ సర్వీస్ వ్యాపారంలో సరికొత్త టెక్నాలజీ. ఈ కనెక్షన్‌లు కాంతి వేగంతో డేటాను ప్రసారం చేసే ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను ఉపయోగిస్తాయి. కేబుల్ లేదా DSL కాకుండా ట్రాన్స్ మిషన్ అనేది గ్లాస్ ద్వారా జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఎలాంటి అవాంతరాలను కలగకుండా చేస్తుంది. ఇందులో రెండు రకాల ఫైబర్ కనెక్షన్లు ఉన్నాయి. అవి డైరెక్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ (DIA), ఫైబర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్. డైరెక్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది వ్యాపారులు సాధారణంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక ఇంటర్నెట్ లైన్. ఇది మరింత భద్రత, విశ్వసనీయతతో కూడిన కనెక్టివిటీని అందిస్తుంది. ఫైబర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్‌ను వ్యక్తిగతంగా ఇళ్లలో ఉపయోగిస్తారు. ఫైబర్‌నెట్ వేగం 150 Mbps నుంచి 1000 Mbps వరకు ఉంటుంది.

 

బ్యాండ్‌విడ్త్, లేటెన్సీ

 

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు గరిష్ట డౌన్‌లోడ్ బ్యాండ్‌విడ్త్ ఆధారంగా ఇంటర్నెట్ ప్లాన్ స్పీడ్‌ను ప్రదర్శిస్తారు.

 

బ్యాండ్‌విడ్త్ అనేది మీ ఇంటర్నెట్ ప్రతి సెకనుకు మీ కంప్యూటర్‌కు ఎంత డేటాను పంపగలదో, అందుకోగలదో సూచిస్తుంది. ఈ సమాచారం మీ కంప్యూటర్‌కు చేరడానికి తీసుకునే పూర్తి సమయం ఆధారంగా లేటెన్సీని కొలుస్తారు.

 

ఇంటర్నెట్ స్పీడ్‌ను లేటెన్సీకి బదులుగా బ్యాండ్‌విడ్త్ లో ఎందుకు కొలుస్తామో అని చాలా మంది ఆశ్చర్యపోతారు. లేటెన్సీ అనేది కేవలం మైక్రో సెకన్లతో విభేదిస్తుంది. ఇది గేమింగ్‌కు ముఖ్యమైనది కానీ, ఇతర ఆన్‌లైన్ కార్యకలాపాల కోసం చాలా చిన్న విషయం.

 

మీకు ఎంత స్పీడ్ అవసరం?

 

నెట్‌ఫ్లిక్స్ (Netflix) తమ వినియోగదారులకు పూర్తి HD కంటెంట్‌ను స్ట్రీమ్ చేయడానికి కనీసం 10 Mbps, 4K అల్ట్రా HD కంటెంట్ కోసం 25 Mbps అవసరం అని చెబుతుంది. అయితే మీరు ఒకేసారి ఎక్కువ పరికరాలను కనెక్ట్ చేయాలని భావిస్తే మీరు ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్‌ను ఎంచుకోవాలి. ఇతర స్ట్రీమింగ్ సేవలు, యూట్యూబ్ (YouTube), ట్విచ్ (Twitch) వంటి గేమింగ్ సేవలకు కూడా ఇది వర్తిస్తుంది.

 

అనేక పరికరాలకు ఇంటర్నెట్ అందించాలంటే మరింత బ్యాండ్‌విడ్త్ అవసరమని కూడా గుర్తించండి. మీరు ఒకేసారి 4K వీడియో కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయడం, నెట్‌వర్క్ కు అనేక పరికరాలను కనెక్ట్ చేయాలని అనుకుంటే మీరు వేగవంతమైన డౌన్‌లోడ్ స్పీడ్ ప్లాన్ కోసం పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించాలి. ఉదాహరణకు 200 Mbps అనేది చాలా మంది వినియోగదారులకు పని చేస్తుంది.

 

మీ ఇంటర్నెట్ వినియోగానికి మరింత బ్యాండ్‌విడ్త్ అవసరమైతే మీరు గిగాబిట్ కనెక్షన్‌లను కూడా ఎంచుకోవచ్చు.

 

తక్కువ స్పీడ్ సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించాలి?

 

ఇంటర్నెట్ వేగాన్ని ప్రభావితం చేసేందుకు అనేక అంశాలు ఉండవచ్చు. వాటిని మీ కోసం ఇక్కడ వివరించాము.

1.       మీ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్

ACT ఫైబర్‌నెట్ అనేది ఫైబర్ నెట్ ద్వారా మీ ఇంటికి ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. అయితే DSL, లోయర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు సాధారణంగా రాగిని ఉపయోగించి వైరింగ్ చేయబడతాయి. ఎక్కువగా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అనేవి హైబ్రిడ్ ఫైబర్, కాపర్ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్‌ను అందిస్తాయి. ACT ఫైబర్‌నెట్ 100% ఫైబర్ నెట్‌వర్కును ఉపయోగించి మీ ఇంటికి నేరుగా ఇంటర్నెట్‌ను అందిస్తుంది.

 

2.       హోమ్ నెట్‌వర్క్

 

మీ ఇంటి లోపల అనేక అంశాలు మీరు ఇంటర్నెట్ ద్వారా డేటాను పంపే లేదా స్వీకరించే రేటును ప్రభావితం చేయవచ్చు. వాటిలో ఇవి కూడా ఉంటాయి:

 

ఒకవేళ వైరింగ్ పాతది అయితే.. కనెక్షన్ బలహీనంగా ఉంటుంది.

 

రౌటర్, మీ డివైస్ మధ్య దూరం కూడా ప్రభావితం చేస్తుంది. మీ రౌటర్‌ను మీ ఇంటికి మధ్యలో ఉండే ప్రదేశంలో ఉంచడం ఎల్లప్పుడూ మంచిది.

 

మీరు ఉపయోగిస్తున్న రౌటర్ వ్యవధి, రకం కూడా ప్రభావితం చేస్తుంది. మీరు కొన్ని సంవత్సరాల తర్వాత మీ రౌటర్‌ను మార్చాలని, మీ ఇంటర్నెట్ ప్లాన్ ఆధారంగా మీ రౌటర్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సిఫారసు చేయబడుతుంది.

 

ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన పరికరాల సంఖ్య కూడా ప్రభావితం చేస్తుంది. మీ ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్‌ ను ఉపయోగించే పరికరాల సంఖ్య మీకు తక్కువ స్పీడ్ వచ్చేలా చేసేలా నెట్‌వర్కుపై రద్దీని ఏర్పరుస్తుంది.

3.       ఏ రకమైన కనెక్షన్ వాడాలి?

కనెక్షన్ రకాలు

 

మీరు వైరింగ్ చేయబడ్డ ఈథర్నెట్ కేబుల్ లేదా వైర్‌లెస్ కనెక్షన్ ద్వారా మీ ఇంటికి ఇంటర్నెట్‌ను కనెక్ట్ చేయవచ్చు. వైరింగ్ చేయబడ్డ కేబుల్ కనెక్షన్లు మీ గోడ లేదా రూటర్‌లోని ఈథర్నెట్ పోర్టుకు కనెక్ట్ చేయబడిన Cat5e లేదా Cat6 వైర్లను ఉపయోగిస్తాయి. వైర్డ్ కనెక్షన్‌లు స్థిరమైన పనితీరు, వేగాన్ని అందిస్తాయి. వైర్‌లెస్ కనెక్షన్‌లు మీ ఇంటి గుండా వెళ్లే సౌకర్యాన్ని అందిస్తాయి. అయితే అవి వైర్డు కనెక్షన్ తరహాలో వేగంగా ఉండవు. మీ రౌటర్‌కు దగ్గరగా ఉన్న అత్యుత్తమ Wi-Fi సిగ్నల్ మీకు లభిస్తుంది, తక్కువ పరికరాలకు మాత్రమే అందుతుంది.

 

4.       పరికరాల రకం, సంఖ్య

 

అన్ని పరికరాలు గరిష్ట ఇంటర్నెట్ వేగాన్ని కలిగి ఉంటాయి. అయితే ఆ ఇంటర్నెట్ వేగం మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్లాన్ తరహాలో వేగంగా ఉండకపోవచ్చు. ఉదాహరణకు, మీ పాత ల్యాప్‌టాప్ లేదా మొబైల్ 20Mbpsకి మాత్రమే సపోర్ట్ చేస్తుంటే మీకు 1Gbps ఇంటర్నెట్ ప్లాన్ ఉన్నా.. మీ ల్యాప్‌టాప్ 20 Mbps కంటే ఎక్కువ ఇంటర్నెట్ వేగాన్ని చేరుకోదు.

5.       టీవీ, ఇంటర్నెట్ స్పీడ్

చాలా సందర్భాలలో  మీ ఇంట్లోని టీవీ, ఇంటర్నెట్ కనెక్షన్‌లు ఒకే కేబుల్ ద్వారా అనుసంధానమై ఉంటాయి. అలాంటి సందర్భాల్లో రెండు సేవలను ఒకేసారి ఉపయోగించడం వల్ల ఆ ప్రభావం బ్యాండ్‌విడ్త్ పై ఉండటంతో పాటు మీ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ వేగంపైనా ప్రభావం పడుతుంది. ఉదాహరణకు మీరు టీవీలో ఎక్కువ సంఖ్యలో HD షోలను వీక్షించే సమయంలో మీ కంప్యూటర్‌లో పూర్తి HD మూవీ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడం వంటివి చేయడం ద్వారా ఎక్కువ ఇంటర్నెట్ డేటా వినియోగించబడుతుంది. అలాంటి సమయాల్లో మీ ఇంటి ఇంటర్నెట్ నెట్‌వర్క్ స్పీడ్ అనేది సాధారణ పరిస్థితులలో ఉండే ఇంటర్నెట్ స్పీడ్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.

6. మీరు ఇతర నెట్‌వర్కులను, వెబ్‌సైట్‌లను సందర్శించినప్పుడు

కొన్నిసార్లు మీరు ఇంటరాక్ట్ అయ్యే వెబ్‌సైట్‌లు తమ సేవలను ఒకే వేగంతో అందించకపోవచ్చు. మీరు వెబ్‌సైట్‌లను సర్ఫ్ చేస్తున్నప్పుడు పరిగణించాల్సిన విషయాలు:

ఇతర వెబ్‌సైట్‌లు మీ ఇంటర్నెట్ ప్లాన్‌తో సమానమైన ఇంటర్నెట్ వేగాన్ని కలిగి ఉండకపోవచ్చు.

వెబ్‌సైట్ సర్వర్ సామర్థ్యాలు అనేవి మీ ఇంటర్నెట్ వేగం, అనుభవాన్ని ప్రభావితం చేస్తాయి.

వెబ్‌సైట్‌లు మీకు డేటాను తిరిగి అందించడానికి ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లను ఉపయోగించవచ్చు. ఈ ఏర్పాట్లు మీ ఇంటర్నెట్ వేగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.

వెబ్‌సైట్ పీక్ టైమ్‌లో సర్ఫింగ్ చేయడం కూడా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గడానికి ఒక కారణం కావచ్చు.

ఒకవేళ మీరు మీ ఇంటర్నెట్ కనెక్షన్‌తో సమస్యలను ఎదుర్కొంటే, మీరు ACT ఫైబర్‌నెట్ ద్వారా ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్‌ను ఎంచుకోవచ్చు. ప్లాన్‌ల గురించి మీరు ఇక్కడ మరింత తెలుసుకోవచ్చు.

  • Share

Be Part Of Our Network

Read something you liked?

Find the perfect internet plan for you!

Chat How may i help you?