Footer Bottom Menu

మీ పనిని చిరాకు లేకుండా ఉంచే 5 పాపులర్ రూటర్లు.

  • 48

  • 06 Jul 2022

  • 2 minutes

మీ పనిని చిరాకు లేకుండా ఉంచే 5 పాపులర్ రూటర్లు.

బెస్ట్ వైఫై రౌటర్లు కావాలని వెతుకున్న గృహ వినియోగదారులకు కింది 5 రౌటర్లు అత్యుత్తమ ఎంపికలుగా నిలుస్తాయి. వీటిని ఇన్స్టాల్ చేసుకుంటే నిరాశ లేని రోజువారీ ఫలితాలను మీరు చూసేందుకు ఆస్కారం ఉంటుంది.

TP-Link Archer C20 AC750 Wireless Dual Band Router TP-Link Archer C20 AC750 వైర్లెస్ డ్యుయల్ బ్యాండ్ రౌటర్

ఇది మార్కెట్లో సరసమైన ధరల్లో లభిస్తున్న డ్యుయల్ బ్యాండ్ రౌటర్. 2.4GHzలో 300Mbps స్పీడ్, 5GHzలో 433Mbps స్పీడ్ను ఇది అందజేస్తోంది. ఈ రౌటర్కు ఉన్న మూడు ఓమ్నీ డైరెక్షనల్ యాంటెన్నాల ద్వారా పటిష్టమైన నెట్వర్క్ మనకు లభిస్తుంది. ఆన్లైన్ మీటింగ్లకు కావాల్సిన ఇంటర్నెట్ స్పీడును అందించడంలో కూడా ఇది సాయపడుతుంది. ఈ రౌటర్ను ఉపయోగించి పేరెంటల్ కంట్రోల్స్ కూడా సెట్ చేయవచ్చు. రౌటర్ను సెటప్ చేయడం, నెట్వర్క్ను కస్టమైజ్ చేసుకోవడం వంటివి ఫోన్లో ఉన్న టెథర్ యాప్ ద్వారా లేదా వెబ్ ఇంటర్ఫేస్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు.

ASUS RT-AC53 AC750 Dual Band Gigabit WiFi Router ASUS RT-AC53 AC750 డ్యుయల్ బ్యాండ్ గిగాబిట్ వైఫై రౌటర్

2.4GHzలో 300Mbps స్పీడ్, 5GHzలో 433Mbps స్పీడ్ అందించే ఈ రౌటర్లో 256QAM చిప్సెట్ ఉంటుంది. ఇది మంచి వైఫై ని అందిస్తుంది. ఈ రౌటర్ వైర్లెస్ నెట్వర్క్లో ఎటువంటి జాప్యం ఉండదు. ఆన్లైన్ సినిమాలు, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్ నిరంతరాయంగా చేయవచ్చు. ఈ పరికరం యొక్క ప్రత్యేక లక్షణం వల్ల, ఇది మీ సాంప్రదాయక రౌటర్గా కనెక్ట్ చేయడానికి, లేదా యాక్సెస్ పాయింట్ను ఏర్పాటు చేయడానికి లేదా మరొక రౌటర్తో కలిపి రిపీటర్గా ఉపయోగించడానికి కూడా మిమ్మల్నిఅనుమతిస్తుంది. ASUS రౌటర్ యాప్ ద్వారా ఇంట్లోనే కూర్చుని ఈ మోడ్స్ మధ్య నెట్వర్క్ను మార్చుకుంటూ ఆనందించచ్చు.

Tenda AC10 1200Mbps Wireless Smart Dual-Band Gigabit WiFi Router Tenda AC10 1200Mbps వైర్లెస్ స్మార్ట్ డ్యుయల్ బ్యాండ్ గిగాబిట్ వైఫై రౌటర్

భవిష్యత్తు కోసం కూడా సిద్ధంగా ఉండే కాన్ఫిగరేషన్ ఉన్న ఈ రౌటర్ మెరుపు కంటే వేగవంతమైనది. ఇది 2.4GHz లో 300Mbps, 5GHz లో 867Mbps స్పీడ్ అందిస్తుంది. నాలుగు ఎక్స్టర్నల్ 5dBi యాంటెన్నాలు మీకు ఓమ్ని డైరెక్షనల్ కవరేజిని అందిస్తాయి. MU-MIMO (మల్టీ-యూజర్, మల్టీపుల్ ఇన్పుట్, మల్టీపుల్ ఔట్పుట్) టెక్నాలజీ, అనేక పరికరాలు ఒకేసారి నెట్వర్క్ను వాడుతున్నా కానీ ఎటువంటి జాప్యం లేకుండా చేస్తుంది. రేంజ్, సిగ్నల్ బలాన్ని మెరుగుపర్చేందుకు ఈ రౌటర్ బీమ్ ఫార్మింగ్ను సపోర్ట్ చేస్తుంది.

TP-Link Archer C6 Gigabit AC1200 MU-MIMO router TP-Link ఆర్చర్ C6 గిగాబిట్ AC1200 MU-MIMO రౌటర్

MU-MIMO టెక్నాలజీతో పనిచేసే స్మార్ట్ రౌటర్ ఇది. 5GHz బ్యాండ్విడ్త్లో 867Mbps వరకు, 2.4GHzలో 300Mbps వరకు స్పీడ్ను ఇది సపోర్ట్ చేస్తుంది. అంతేగాక ఇది మంచి కవరేజిని కూడా అందిస్తుంది. దీని స్పీడు విషయానికి వస్తే లైన్ ఆఫ్ సైట్లో లేని పరికరాల్లో కూడా ఇది స్పీడుని మెరుగుపరుస్తుంది. ఎక్కువగా గోడలు ఉన్న భవనాల్లో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పని చేస్తుంది. ఎలివేటెడ్ నెట్వర్క్ వలన కనెక్ట్ చేయబడిన అన్ని పరికరాల్లో కూడా స్పీడ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

Netgear R6260 AC1600 Smart WiFi Router Netgear R6260 AC1600 స్మార్ట్ వైఫై రౌటర్

ఈ రౌటర్ అత్యధిక కనెక్టివిటీ స్పీడ్ను కలిగి ఉంటుంది. 5GHzలో 1300Mbps స్పీడ్, 2.4GHzలో మీకు 300Mbps స్పీడ్ను అందజేస్తుంది. దీనిలో నెట్వర్క్ యొక్క సులభమైన కాన్ఫిగరేషన్, రియల్ టైమ్ మానిటరింగ్ను అందించేందుకు ఇది NETGEAR Nighthawk అనే మొబైల్ యాప్ను కలిగి ఉంటుంది. అత్యుత్తమ పర్ఫామెన్స్ అందజేసేందుకు ఇందులో 880MHz ప్రాసెస్ అందజేయబడుతుంది.

హోమ్ బ్రాడ్ బాండ్ కనెక్షన్ వైఫై సెటప్తో పాటుగా మీరు RJ45 కనెక్టర్ ఉన్న కేబుల్ కూడా వస్తుంది. దీన్ని మీరు రౌటర్లో ప్లగ్–ఇన్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అత్యధిక స్పీడ్తో ఇంటర్నెట్ కావాలి కావున శక్తివంతమైన సెక్యూరిటీ ఫీచర్లు ఉన్న ఈథర్నెట్ రౌటర్ అయితే ఎటువంటి అంతరాయాలు లేకుండా పనులు చేసుకునే వీలుంటుంది.

Read tips and tricks to increase your wifi speed here

Related blogs

78

Why secure internet is non-negotiable for modern businesses?
3 minutes read

Why secure internet is non-negotiable for modern businesses?

Read more

37

The importance of low latency for SaaS companies
2 minutes read

The importance of low latency for SaaS companies

Read more

71

Customized Network Solutions: How ACT Enterprise Tailors Connectivity to Your Needs
3 minutes read

Customized Network Solutions: How ACT Enterprise Tailors Connectivity to Your Needs

Read more
2
How may i help you?