చెల్లించడానికి 4 సులభమైన మార్గాలు
-
96
-
28 Feb 2022
-
4 minutes

బిల్ చెల్లింపు
యాక్ట్ ఫైబర్‌నెట్ బిల్లును ఆన్‌లైన్‌లో చెల్లించడానికి 4 సులువైన మార్గాలు
క్యాష్‌లెస్ డిజిటల్ ఇండియా అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో, మీ నెలవారీ బ్రాడ్‌బ్యాండ్ అద్దెను డబ్బు రూపంలో కాకుండా ఇతర మార్గాలలో చెల్లించేందుకు తగిన విధానం కోసం చూస్తున్నారా? మీ ACT Fibernet బిల్లును చెల్లించేందుకు వివిధ పద్దతులను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఆన్‌లైన్ లో బిల్లు చెల్లింపులకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా? గతంలో ఉండే కలెక్షన్ పికప్ వంటి విధానంలో కాకుండా మీ సౌలభ్యం కోసం అనేక ఆమోదయోగ్యమైన పేమెంట్ పద్దతులు ఇప్పుడు మా వద్ద ఉన్నాయి.
నగదు రహిత (క్యాష్‌లెస్) విధానాన్ని ఎందుకు అనుసరించాలి?
ప్రస్తుతం చాలా మంది వినియోగదారులు వివిధ రకాల ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి ఆన్‌లైన్ లో చెల్లించడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇది వారికి సులభంగా చెల్లించే సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ విధానాన్ని ఉపయోగించి మీరు మీ బిల్లులను అర్ధరాత్రి లేదా రైలులో ప్రయాణిస్తూ కూడా చెల్లించవచ్చు. వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు అందించే ఈ సౌకర్యం కారణంగా ఆన్‌లైన్ బిల్ పేమెంట్ ప్రతిఒక్కరు ఇష్టపడే పేమెంట్ పద్ధతిగా మారుతుంది.
ACT యొక్క సొంత వెబ్ సైట్, మొబైల్ యాప్ లోనే కాకుండా మీరు చెల్లించేందుకు మా పార్టనర్లను కూడా ఎంచుకోవచ్చు. వారి ఈ-వాలెట్ లను ఉపయోగించినందుకు డిస్కౌంట్/ క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. మీకు అనువుగా ఉన్నప్పుడు నగదు రహిత పద్ధతిని ఎంచుకొని ఎప్పుడైనా చెల్లించే స్వేచ్ఛను ఆస్వాదించవచ్చు.
అయితే, ఆన్‌లైన్ లో చెల్లించేందుకు ఉన్న వివిధ ఆప్షన్లు ఏమిటి?
మీకు నమ్మశక్యంకాని వేగవంతమైన, నిరంతరమైన ACT ఫైబర్ నెట్ ను ఆస్వాదించడానికి వివిధ ఎలక్ట్రానిక్ పేమెంట్ పద్దతుల యొక్క ఈ సమగ్ర జాబితా నుండి మీకు మరింత అనుకూలమైన పేమెంట్ విధానాన్ని ఎంచుకోవడానికి చదవండి:
ACT మొబైల్ యాప్: మా లాగే మీరు స్మార్ట్‌ఫోన్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటే, మీరు మా మొబైల్ యాప్‌ని ఇష్టపడతారు. ACT ఫైబర్ నెట్ యాప్, ACT అకౌంట్ మేనేజ్‌మెంట్ కు సంబంధించిన మీ అన్ని అవసరాలకు ఒక కేంద్రం లాగా పని చేస్తుంది. మీరు ఇక్కడ కొత్త కనెక్షన్ కోసం అభ్యర్థించవచ్చు, చెల్లింపులు చేయవచ్చు, మీ డేటా వినియోగాన్ని ట్రాక్ చేయవచ్చు, ప్లాన్ యాడ్-ఆన్‌ల కోసం అభ్యర్థించవచ్చు, మీ ప్రస్తుత ప్లాన్‌ని సవరించవచ్చు. ఈ ఒక్క యాప్ నుండే మీరు సర్వీస్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు, మీ సర్వీస్ అభ్యర్థనలను ట్రాక్ చేయవచ్చు.
మీ మునివేళ్లతో చేసే ఒక చిన్న ట్యాప్ తో కస్టమర్ సర్వీస్ మీ ముందు ఉంటుంది, నిజంగా! మీ గొప్ప ఇంటర్నెట్ కనెక్షన్‌తో మీకు సహాయపడే అద్భుతమైన యాప్ ఇది.
యాప్‌ను మొదటిసారి ఉపయోగిస్తున్నప్పుడు, మీ లాగిన్ వివరాలను నమోదు చేయమని అడుగుతుంది. ఒకసారి మీరు లాగిన్ అయ్యాక మీ ప్రస్తుత బిల్ సైకిల్ వివరాలు, బకాయిలు కనిపిస్తాయి (ఏదైనా ఉంటే). మీరు ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్‌లు కలిగి ఉంటే "Pay Due Amount", "Pay" లేదా "Pay for" లో దేనినైనా ఎంచుకోవచ్చు.
బిల్లు చెల్లించడానికి, మొబైల్ యాప్‌లోని "Pay Bill" పై క్లిక్ చేస్తే, చెల్లించాల్సిన మొత్తం కనిపిస్తుంది. మీరు చెల్లించడానికి "Proceed" ను ఎంచుకుంటే, మీ క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా ఏదైనా వాలెట్ ను ఉపయోగించి చెల్లించవచ్చు.
ACT పోర్టల్: మీరు ACT పోర్టల్ ద్వారా మీ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేశాక, మీరు మీ బిల్లింగ్‌లు, వాడకపు చరిత్ర, సబ్‌స్క్రిప్షన్‌లు, యూజర్ ఖాతాను పోర్టల్ హోమ్ పేజీ నుండే నిర్వహించవచ్చు. మీ ప్లాన్ వివరాలు, మునుపటి బకాయిలు, ప్రస్తుత ఇన్వాయిస్ అమౌంట్, మీ ఖాతాలో టాప్-అప్ అడ్వాన్స్, ఏవైనా బకాయిలను తీర్చడానికి హోమ్ పేజీ ఎడమ ప్యానెల్ లో ఉన్న "Pay Bill" ని ఎంచుకోండి. ఇక్కడ కూడా, మీరు మీ క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా వాలెట్ ను ఉపయోగించి చెల్లించవచ్చు.
ACT వెబ్‌సైట్: ఏవైనా బకాయిల చెల్లింపులు చేయడానికి www.actcorp.in కు లాగిన్ అవ్వండి. కుడి వైపు మెనూలోని “Bill Payment” పై క్లిక్ చేయండి. లేదా మీరు https://selfcare.actcorp.in/payments/external-bills తెరిచి, మీ నగరాన్ని ఎంచుకుని, కొనసాగించడానికి మీ సబ్స్క్రిప్షన్ ID ని నమోదు చేయండి. ఇది మీ ఖాతా వివరాలతో పాటు ఏవైనా బకాయిలు ఉంటే చూపిస్తుంది.
మీరు ఎంత మొత్తాన్ని చెల్లించాలనుకుంటున్నారో ఎంచుకోవడానికి "Pay Due Amount" లేదా "Pay other Amount" నుండి ఎంచుకోవచ్చు. ఆఫర్‌లను పొందడానికి ఏదైనా కూపన్ కోడ్‌ని (మీ వద్ద ఉంటే) నమోదు చేసే అవకాశం కూడా ఉంది. మీరు "Proceed" పై క్లిక్ చేసినప్పుడు క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా ఏదైనా వాలెట్ ను ఉపయోగించి చెల్లించగల పేమెంట్ గేట్‌వేకి మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది. ఇందులో మీ పేమెంట్ కేవలం మూడు దశల్లోనే పూర్తవుతుంది.
ఫ్రీచార్జ్/ మొబిక్విక్/ పేటీఎం (Freecharge/ Mobikwik/ Paytm): మీరు మా భాగస్వాములైన ఫ్రీఛార్జ్/ మొబిక్విక్/ పేటీఎం నుంచి ఆన్‌లైన్ చెల్లింపులు చేయడానికి కూడా ఎంచుకోవచ్చు. మీ యూజర్ పేరు/ సబ్‌స్క్రైబర్ ID/ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీ బకాయి మొత్తం/ ప్రస్తుత బిల్లును తిరిగి పొందడానికి ఈ వెబ్‌సైట్‌లకు లాగిన్ చేయండి. మీరు ఇప్పటికే ఈ వెబ్‌సైట్లలో ఏదైనా ఖాతాను కలిగి ఉంటే, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా వాలెట్ బ్యాలెన్స్ ఉపయోగించి వారి వేగవంతమైన, సురక్షితమైన బిల్లు చెల్లింపులను ఆస్వాదించండి.
బకాయిలను చెల్లించేందుకు అవసరమైన లింక్‌లు కింద ఉన్నాయి:
లావాదేవీ విఫలమైతే ఏమి చేయాలి?
మీ లావాదేవీ విఫలమైతే, దయచేసి మీ బ్యాంకు అకౌంట్ నుండి డబ్బు మినహాయించబడిందా లేదా అనేది తనిఖీ చేయండి. ఒకవేళ డబ్బు మినహాయించబడకపోతే, దయచేసి పై ఎంపికలలో దేనినైనా ఉపయోగించి చెల్లింపు చేయడానికి మళ్ళీ ప్రయత్నించండి. డబ్బు మినహాయించబడితే, దయచేసి మా కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించండి లేదా మా మొబైల్ యాప్‌ని ఉపయోగించి టికెట్ రైజ్ చేయండి. ఈ ప్రక్రియలో మేము మీకు తగిన సహాయాన్ని అందిస్తాము.
ఆన్‌లైన్‌లో చెల్లించడం సురక్షితమేనా?
ఖచ్చితంగా! 2016లో నోట్ల రద్దు తర్వాత భారతదేశంలో ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగాయి. పేమెంట్ గేట్‌వేలు & డిజిటల్ వాలెట్‌లు OTP లేదా PIN ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు అదనపు భద్రతను అందిస్తాయి. ఈ లావాదేవీలన్నీ SSL కనెక్షన్ ద్వారా ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. కాబట్టి మీ పూర్తి బ్యాంక్ వివరాలు ఎటువంటి థర్డ్ పార్టీతో పంచుకోబడవు.
దయచేసి మీ ACT అనుభవాన్ని లేదా ఆన్‌లైన్ బిల్లు పేమెంట్ కు సంబంధించిన ఏవైనా ఇతర సమస్యలను మేము ఇక్కడ పేర్కొనకపోతే వాటిని మాకు తెలియజేయండి. మీ సమస్యలను పరిష్కరించడానికి మేము సంతోషంగా ముందుంటాం.
హాయిగా ఇంట్లోనే కూర్చొని మీ బకాయిలను ఆన్‌లైన్‌లో చెల్లించండి. మీకు ఇష్టమైన ఎపిసోడ్‌లను మా వేగవంతమైన ACT ఫైబర్‌నెట్‌లో చూస్తూ ఎంజాయ్ చేయండి!
*క్యాష్‌బ్యాక్/ప్రోమో ఆఫర్‌లు/థర్డ్ పార్టీల ఫ్రీచార్జ్/ఎంబిక్విక్/పేటీఎం & ఇతరుల డిస్కౌంట్లపై అందించే ఏవైనా క్లెయిమ్‌లకు ACT బాధ్యత వహించదు.