HIGH SPEED INTERNET

స్ట్రీమింగ్ స్పీడ్​లు_ మీకు ఎం-త అవసరం, దేని కోసం

Monday, Feb 28, 2022 · 10 mins

4808

స్ట్రీమింగ్ చేసేందుకు మీకు ఎంత ఇంటర్నెట్ స్పీడ్ అవసరం అవుతుంది?

హై స్పీడ్​ ఇంటర్​నెట్​

స్ట్రీమింగ్‌ స్పీడ్స్​; మీకు ఎంత స్పీడు ఇంటర్​నెట్​ కావాలి? ఎందుకోసం?

ఏదేని ఇంటర్​నెట్​ సర్వీస్​ ప్రొవైడర్​ను ఎంపిక చేసుకునే ముందు నెట్​ స్పీడ్ అనేది చాలా ముఖ్యం​. ఇంటర్​నెట్​ స్పీడు అనేది ఒక టాస్కును మనం ఎంత వేగంగా చేయగలం, మన నెట్​వర్క్​ ఎన్ని టాస్కులను హ్యాండిల్​ చేయగలదనే విషయాలను తెలియజేస్తుంది.

ఆన్​లైన్​ లైవ్​ స్ట్రీమింగ్​ కోసం ఎంత స్పీడుతో ఇంటర్​నెట్​ కావాలి?

సాధారణంగా ఆన్​లైన్​ లైవ్​ స్ట్రీమింగ్‌ కొరకు (480p స్టాండర్డ్​ డెఫినిషన్​) కనీసం 3 Mbps స్పీడ్​ అయినా ఖచ్చితంగా ఉండాలి. కనీస డౌన్​లోడ్​ స్పీడు మనం స్ట్రీమ్​ చేసే సైట్​ను బట్టి మారుతూ ఉంటుంది. ఇంటర్​నెట్​ డివైస్​కు ఒకేసారి అధిక సంఖ్యలో పరికరాలు కనెక్ట్​ అయి ఉంటే మీకు ఎక్కువ స్పీడ్​ అవసరమవుతుంది. మనం ఏదేని వీడియోను స్ట్రీమింగ్‌ చేసేటపుడు బెటర్​ క్వాలిటీ వీడియో కావాలంటే బ్రాడ్​ బ్యాండ్​ స్పీడ్​ చాలా ఎక్కువగా ఉండాలి. మీరు కనుక 1080p క్వాలిటీ లేదా 720p క్వాలిటీ ఉన్న వీడియోలను స్ట్రీమింగ్‌ చేయాలని చూసినపుడు మీకు 5 Mbps బ్యాండ్​ విడ్త్​ ఉన్న నెట్​వర్క్​ కనెక్షన్​ అవసరమవుతుంది. 4K వీడియోను నిరంతరాయంగా స్ట్రీమింగ్‌ చేసేందుకు కనీసం 25 Mbps స్పీడున్న నెట్​ అవసరమవుతుంది.

 

Netflix లో వీడియో స్ట్రీమింగ్‌ కావడానికి కావాల్సిన మినిమం స్పీడ్​ ఎంత?

భారత్​లో Netflixకు 2 మిలియన్ల (20 లక్షల) కంటే ఎక్కువ మంది సబ్​స్క్రైబర్లు, 5 మిలియన్ల (50 లక్షల) యాక్టివ్​ యూజర్లు ఉన్నట్లు మార్కెట్​ రియలిస్ట్​ ఒక నివేదికలో తెలిపింది. Netflix అనేది మన దేశంలో ప్రముఖమైన వీడియో స్ర్టీమింగ్​ యాప్​. అంతేకాకుండా ఈ స్ట్రీమింగ్‌ ప్లాట్​ఫాం భారీ ఆదాయాన్ని పొందుతోంది.

 

Netflixలో వీడియోను స్ట్రీమింగ్‌ చేసేందుకు కావాల్సిన డౌన్​లోడ్​ స్పీడ్​ వీడియో క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది.  ఓ మోస్తరు వీడియో నిరంతరాయంగా ప్లే కావడానికి 3 Mbps నెట్​ స్పీడు, HD వీడియోలు ప్లే కావడానికి 5 Mbps స్పీడు, అలాగే అల్ట్రా HD వీడియోలు ప్లే కావడానికి 25 Mbps స్పీడు అవసరమవుతుంది. Netflix హెల్ప్​ సెంటర్​ ప్రతినిధులు వీడియోను స్టార్​ చేసేందుకు 0.5 Mbps స్పీడు సరిపోతుందని, కానీ వీడియోను నిరంతరాయంగా వీక్షించేందుకు ఎక్కువ డేటా స్పీడు అవసరమవుతుందని తెలిపారు. లేదంటే వీడియో సరిగా ప్లే కాదని వారు పేర్కొన్నారు.

 

YouTube​ లైవ్​ స్ట్రీమింగ్‌ కోసం కనీసం ఎంత స్పీడు ఇంటర్​నెట్ అవసరం?

Google నివేదిక ప్రకారం YouTube​ వీడియోలు నిరంతరాయంగా ప్లే అయ్యేందుకు మినిమం 1 Mbps నెట్​ స్పీడు అవసరం. మీరు YouTubeలో లైవ్​ వీడియో చేద్దామని భావించినపుడు కనీసం 2 Mbps స్పీడు అవసరమవుతుంది. YouTubeలో హై డెఫినిషన్​ వీడియోలను ప్లే చేసేందుకు 2.5 Mbps స్పీడున్న నెట్​ కావాలి. అదేవిధంగా 1080p వీడియోలను ప్లే చేయాలంటే దాదాపు 4 Mbpsతో నెట్​ స్పీడ్​ అవసరమవుతుంది. YouTube​లో మీకు అధిక సంఖ్యలో 4K అల్ట్రా

 HD వీడియోలు లభిస్తాయి. వాటిని నిరంతరాయంగా చూసేందుకు 15 Mbps స్పీడు అవసరమవుతుంది. మన నెట్​ స్పీడు కనీసం 3 Mbps అయినా ఉండాలని YouTube సూచిస్తుంది.

ఆన్​లైన్​ లైవ్​ గేమ్​ల కోసం ఎంత నెట్​ స్పీడ్​ అవసరం?

FCC యొక్క బ్రాడ్​బ్యాండ్​ స్పీడ్​ గైడ్​ ప్రకారం ఆన్​లైన్​ గేమ్స్​ ఆడేందుకు మినిమం 1 Mbps స్పీడ్​ అవసరం. మీ నెట్​వర్క్​కు కేవలం మీరు ఒక్కరు మాత్రమే కనెక్ట్​ అయి ఉన్నపుడు ఈ స్పీడు సరిపోతుంది. అలా కాకుండా ఒకేసారి ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఇంటర్​నెట్​కు కనెక్ట్ అయి ఉన్నపుడు స్పీడు 6 Mbps వరకు ఉండాలని FCC సూచిస్తోంది. ఇంటర్​నెట్​ కనెక్షన్​కు కనెక్ట్​ అయి ఉన్న వ్యక్తులు కనుక HD సినిమాలు ప్లే చేసినా, వీడియో కాన్ఫరెన్సులకు హాజరైనా, ఆన్​లైన్​ గేమ్స్​ ఆడుతున్నా మనకు 15 Mbps లేదా అంతకన్నా ఎక్కువ నెట్​ స్పీడ్​ అవసరమవుతుంది. వేర్వేరు గేమింగ్​ ప్లాట్​ఫామ్స్​ చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి, లైవ్​ స్ట్రీమింగ్​ గేమ్స్​ కోసం మీకు కనీసం 1 Mbps స్పీడ్​ అవసరం.

 

Facebook లైవ్​ చేసేందుకు ఎంత స్పీడ్​ ఇంటర్​నెట్​ అవసరం?

Facebook సంస్థ లైవ్​ స్ట్రీమింగ్‌ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. మనం దీనిలో లైవ్​ ద్వారా హై డెఫినేషన్​ వీడియోను స్ట్రీమింగ్‌ చేసేందుకు కనీసం 5 Mbps స్పీడ్​ అసరమవుతుంది. కానీ, యూజర్​ 10 Mbps స్పీడ్​ వచ్చే నెట్​ కనెక్షన్​ను కలిగి ఉండాల్సి ఉంటుంది. Facebook లైవ్​ స్ట్రీమింగ్‌ చేసేందుకు ఏమేమి ఉండాలో సంస్థ చెప్పిన ప్రమాణాలను ఓ సారి పరిశీలిస్తే..

 

ఆడియో బిట్​  స్పీడ్​ 96 Kbps లేదా 128 Kbps

గరిష్ట బిట్​ రేట్​ 4000 kbps

1080p (1920x1080) రిజల్యూషన్​ కోసం ఒక సెకనుకు గరిష్టంగా 60 ఫ్రేములు

4K లైవ్​ స్ట్రీమింగ్‌ వీడియోను నిరంతరాయంగా ప్లే చేయడానికి ఏం కావాలి?

ఎవరైతే యూజర్లు 4K వీడియోను ప్లే చేయాలని చూస్తారో, వారు స్పీడున్న ఇంటర్​నెట్ కనెక్షన్​ను కలిగి ఉండాలి. Netflixలో వీడియోను స్ట్రీమింగ్‌ చేసేందుకు మినిమం 25 Mbps నెట్​ స్పీడ్​ ఉండాలి. కేవలం నెట్​ స్పీడుగా ఉంటే సరిపోదు. 4K HDR కంటెంట్​ను స్ట్రీమింగ్‌ చేసేందుకు 25 Mbps నెట్​ స్పీడుతో పాటు 4K UHD TV, దానికి సపోర్ట్​ చేసే HDR, HEVC డీకోడర్లను యూజర్ కలిగి ఉండాలి.

 

 

వివిధ ఆన్​లైన్​ స్ట్రీమింగ్​ సైట్లలో వీడియోను స్ట్రీమింగ్‌​ చేసేందుకు వేర్వేరు స్పీడ్​లు కావాలి. మీకు ఇంటర్​నెట్ ప్రొవైడర్​ నుంచి సరైన స్పీడు అందుతుందా? లేదా ఇంకా ఎక్కువ స్పీడ్​ కావాలా? అన్న విషయం గుర్తించాలి. మీరు స్పీడుకు సంబంధించిన అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని ఇంటర్​నెట్ ప్యాకేజీని మాట్లాడుకోవాలి. ఇది చాలా మంచి పద్ధతి. ఇంటర్​నెట్​ ప్యాక్​ అనేది మీ బడ్జెట్​లో ఉండేలా చూసుకోవాలి.

  • Share
Article Tags:

Be Part Of Our Network

Read something you liked?

Find the perfect internet plan for you!

Chat How may i help you?