BROADBAND

ACT ఫైబర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్

Wednesday, Apr 26, 2023 · 35 mins

1510

ACT ఫైబర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్

ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్‎బ్యాండ్ ఇంటర్నెట్ అంటే ఏమిటి?

ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్‎బ్యాండ్ అనేది ఇంటర్నెట్ కనెక్షన్ యొక్క ఒక రూపం. ఇది డేటా ప్రసారం కోసం ఆప్టికల్ ఫైబర్లను ఉపయోగిస్తుంది. సాంప్రదాయ కేబుల్స్‎తో పోలిస్తే, ఫైబర్ ఆప్టిక్స్‎లో ఉపయోగించే తీగలు సన్నగా ఉంటాయి మరియు ఇతర సిగ్నల్స్ జోక్యం చేసుకునే అవకాశం తక్కువ. దీని అర్థం వినియోగదారులు ఫైబర్ ఆప్టిక్స్‎తో వేగవంతమైన, మరింత నమ్మదగిన ఇంటర్నెట్ కనెక్షన్‎ను ఆస్వాదించవచ్చు.

సైద్ధాంతికంగా, ఫైబర్ కనెక్షన్లు 1 జీబీపీఎస్ వరకు వేగాన్ని అందిస్తాయి. గేమింగ్, హెచ్‌డీ వీడియోలను స్ట్రీమింగ్ చేయడం మరియు పెద్ద ఫైళ్లను డౌన్లోడ్ చేయడం వంటి వేగవంతమైన కనెక్షన్ అవసరమయ్యే ఇంటర్నెట్ కార్యకలాపాలకు ఇది గొప్ప ఎంపికగా ఉంటుంది.

భారతదేశంలో ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్‎బ్యాండ్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది మరియు యాక్ట్ ఫైబర్‎నెట్ ప్రముఖ ప్రొవైడర్లలో ఒకటి. కానీ యాక్ట్ యొక్క ఫైబర్‎నెట్ ఆఫర్లను తనిఖీ చేసే ముందు, ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లు మరియు సాంప్రదాయ బ్రాడ్‎బ్యాండ్ మధ్య తేడాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది సమాచారం అందించి  వినియోగదారులు వారి ఇంటికి ఉత్తమమైన ఎంపిక కోసం సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది.

ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్ మరియు రెగ్యులర్ బ్రాడ్‎బ్యాండ్ మధ్య తేడా ఏమిటి?

ఫైబర్‎నెట్ కనెక్షన్లు మరియు సాధారణ బ్రాడ్‎బ్యాండ్ కనెక్షన్ల మధ్య అనేక తేడాలు ఉన్నాయి.

· ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్ మరియు సాధారణ బ్రాడ్‎బ్యాండ్ మధ్య ప్రధాన వ్యత్యాసం- ఉపయోగించిన డేటా ట్రాన్స్‎మిషన్ టెక్నాలజీ రకం. సాధారణ బ్రాడ్‎బ్యాండ్ డేటాను ప్రసారం చేయడానికి రాగి కేబుల్స్‎ని ఉపయోగిస్తుంది. ఫైబర్ చాలా సన్నని ఆప్టికల్ ఫైబర్లను ఉపయోగిస్తుంది.

· రెండవ అత్యంత స్పష్టమైన వ్యత్యాసం- వేగం. ఫైబర్‎నెట్ కనెక్షన్లు సాంప్రదాయ ఇంటర్నెట్ కనెక్షన్ రకాల కంటే చాలా వేగంగా ఉంటాయి. వినియోగదారులు తక్కువ సమయంలో ఆన్లైన్లో ఎక్కువ సర్ఫింగ్ చేయడానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు ఫైబర్‎నెట్ బ్రాడ్‎బ్యాండ్ 1 జీబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్ని అందిస్తుంది. అయితే రాగి (కాపర్) ఆధారిత కనెక్షన్లు 300 ఎంబిపిఎస్ వరకు మాత్రమే వేగాన్ని అందిస్తాయి.

· ఫైబర్‎నెట్ కనెక్షన్లు వాతావరణం మరియు దూరం వంటి బాహ్య కారకాలచే ప్రభావితం చేయబడవు కాబట్టి మంచి విశ్వసనీయతను కూడా అందిస్తాయి. మరోవైపు సాంప్రదాయ బ్రాడ్‎బ్యాండ్ కనెక్షన్లు బాహ్య కారకాల వల్ల అస్థిరతలను కలిగి ఉండవచ్చు.

· బ్రాడ్‎బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ల ఖర్చు ప్రస్తుతం ఫైబర్‎నెట్ కనెక్షన్ల కంటే తక్కువగా ఉంటుంది. ఏదేమైనా ఫైబర్‎నెట్ కనెక్షన్లు ఖర్చు పరంగా మంచి ఎంపికగా మారడానికి ఎంతో సమయం పట్టేలా లేదు.

· చివరగా ఫైబర్‎నెట్ కనెక్షన్లు సాధారణ బ్రాడ్‎బ్యాండ్ కనెక్షన్ల కంటే మరింత సురక్షితమైనవి. ఎందుకంటే వాటిని అంత సులభంగా ట్యాపింగ్ చేయలేరు. లేదా ఇతర సిగ్నల్స్ అంత సులభంగా జోక్యం చేసుకోలేవు. కానీ సంప్రదాయ బ్రాడ్‎బ్యాండ్ కనెక్షన్లు ట్యాపింగ్‌కి గురై భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురుకావొచ్చు.

యాక్ట్ ఫైబర్‎నెట్ బ్రాడ్‎బ్యాండ్ అంటే ఏమిటి?

యాక్ట్ (అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్) భారతదేశం యొక్క ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి. ఇది దేశవ్యాప్తంగా విస్తరించి పెద్ద యూజర్ బేస్‎ను కలిగి ఉంది. 'ది బెస్ట్ బ్రాండ్ అండ్ మోస్ట్ ఐకానిక్' ఈటీ సహా పలు కేటగిరీల్లో పలు అవార్డులు గెలుచుకుంది.

యాక్ట్ ఫైబర్‎నెట్ 1 జీబీపీఎస్ వరకు వేగంతో ఫైబర్ బ్రాడ్‎బ్యాండ్ కనెక్షన్ ప్లాన్ల శ్రేణిని అందిస్తుంది. హెచ్‌డీ వీడియోలను స్ట్రీమింగ్ చేయడం, పెద్ద ఫైళ్లను డౌన్లోడ్ చేయడం మరియు గేమింగ్ వంటి ఇంటెన్సివ్ ఆన్లైన్ కార్యకలాపాలకు ఈ కనెక్షన్లు అనువైనవి. యాక్ట్ ఫైబర్‎నెట్ పరిశ్రమలో కొన్ని ఉత్తమ కస్టమర్ సేవలను కూడా అందిస్తుంది. కాబట్టి వినియోగదారులు వారి అవసరాలకు తగిన దానిని పొందగలరని హామీ ఇవ్వవచ్చు.

ఈ రోజు అందుబాటులో ఉన్న అత్యంత విశ్వసనీయమైన ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఎంపికలలో యాక్ట్ ఫైబర్‎నెట్ ఒకటి. అందుబాటులో ఉన్న వివిధ యాక్ట్ ఇంటర్నెట్ ఫైబర్ బ్రాడ్‎బ్యాండ్ ప్లాన్లను ఇక్కడ తెలుసుకోండి.

రెసిడెన్షియల్ కస్టమర్ల కొరకు:

· యాక్ట్ వెల్ కమ్ - నెలకు కేవలం రూ.549తో 50 ఎంబీపీఎస్ స్పీడ్, అన్ లిమిటెడ్ డేటా.

· యాక్ట్ సిల్వర్ ప్రోమో - నెలకు కేవలం రూ.799తో 150 ఎంబీపీఎస్ స్పీడ్, అన్లిమిటెడ్ డేటా.

· యాక్ట్ ప్లాటినం ప్రోమో - నెలకు కేవలం రూ.1049తో 250 ఎంబీపీఎస్ స్పీడ్, అన్ లిమిటెడ్ డేటా.

· యాక్ట్ డైమండ్ - నెలకు కేవలం రూ.1349తో 300 ఎంబీపీఎస్ స్పీడ్, అన్ లిమిటెడ్ డేటా.

· యాక్ట్ గిగా - నెలకు కేవలం రూ.1999కే 1 జీబీపీఎస్ స్పీడ్, అన్ లిమిటెడ్ డేటా.

ఎక్కువ నెలలు, ఉచిత వైఫై రౌటర్లు మరియు నెట్‎ఫ్లిక్స్ కాంప్లిమెంటరీ సబ్‎స్క్రిప్షన్ వంటి అనేక ఆఫర్లను యాక్ట్ అందిస్తుంది, ఇవి పై ప్లాన్లలో ఒకదాన్ని సబ్‎స్క్రైబ్ చేయాలనుకునే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్లాన్ల విలువను మరింత పెంచుతాయి.

కమర్షియల్ కస్టమర్ల కొరకు:

యాక్ట్ వాణిజ్య వినియోగదారుల కోసం 1 జీబీపీఎస్ వరకు వేగంతో అనేక వ్యాపార ప్రణాళికలను కూడా అందిస్తుంది. వ్యాపార సంస్థలు తమ ఇంటర్నెట్ కనెక్షన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడే మ్యానేజ్డ్ వైఫై మరియు ఎస్‌డీ-డబ్ల్యూఏఎన్‌ వంటి వాణిజ్య వినియోగదారులకు అందించే ఇతర సేవలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు యాక్ట్ ఫైబర్‎నెట్ బ్రాడ్‎బ్యాండ్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు లాభాల గురించి తెలుసుకుందాం.

యాక్ట్ ఇంటర్నెట్ కనెక్షన్‎ల ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో ఫైబర్ బ్రాడ్‎బ్యాండ్ కనెక్షన్ ప్రొవైడర్లు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రజలు యాక్ట్ ఫైబర్‎నెట్‎ను ఎందుకు ఎంచుకోవాలి? అనేది తెలుసుకోడానికి.. యాక్ట్ కనెక్షన్‎తో వినియోగదారులు అందే కొన్ని ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.

సరసమైన ప్లాన్లు

వేర్వేరు ఐఎస్‎పిలు అందించే చాలా ఫైబర్ కనెక్షన్లు చాలా ఖరీదైనవి. యాక్ట్ ఫైబర్ సరసమైన ప్లాన్లను కలిగి ఉంది, అంటే వినియోగదారులు తమ జేబులకు గండి పడకుండా మెరుగైన-వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని ఆస్వాదించవచ్చు. అత్యంత సరసమైన ప్లాన్ నెలకు కేవలం రూ.549 తో ప్రారంభమవుతుంది, ఇది మంచి రెస్టారెంట్లో భోజనం ఖర్చు కంటే తక్కువ.

హై-స్పీడ్ కనెక్షన్లు

యాక్ట్ ఫైబర్‎నెట్ భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్లను అందిస్తుంది. ఇది 1 జీబీపీఎస్ వరకు వేగంతో ఉంటుంది. దీని అర్థం వినియోగదారులు తాజా కంటెంట్‎ను ఎటువంటి లాగ్స్ లేదా బఫరింగ్ లేకుండా 1080p మరియు 4Kలో కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇది పెద్ద ఫైళ్లను నిమిషాల్లో డౌన్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. వాణిజ్య వినియోగదారుల విషయంలో ఇది చాలా ముఖ్యమైనది.

అపరిమిత డేటా

యాక్ట్ ఫైబర్‎నెట్‌కి సంబంధించి మరో గొప్ప విషయం ఏమిటంటే, ఫెయిర్ యూసేజ్ పాలసీకి లోబడి అన్ని ప్లాన్లు అపరిమిత డేటాతో వస్తాయి. అందువల్ల యూజర్లు డాటా అయిపోవడం లేదా పరిమితులను దాటడం గురించి ఆందోళన చెందకుండా తమకు కావలసినంత డేటాను వాడుకోవచ్చు. గేమర్లు, స్ట్రీమర్లు వంటి ఎక్కువ డేటాను వినియోగించే వారికీ ఇది ఉపయోగపడుతుంది.

అంతరాయం లేని వేగం

యాక్ట్ ఫైబర్‎నెట్ అత్యాధునిక నెట్వర్క్ ఇన్‎ఫ్రాస్ట్రక్చర్‎ను అందిస్తుంది. ఇది వినియోగదారులు పగలు లేదా రాత్రి ఏ సమయంలో అయినా అంతరాయం లేని వేగాన్ని పొందేలా చేస్తుంది. ఉత్తమ గేమింగ్ అనుభవాన్ని కలిగి ఉండటానికి అంతరాయం లేని కనెక్షన్ అవసరమయ్యే గేమర్లకు ఇది చాలా ముఖ్యం.

విశ్వసనీయత

యాక్ట్ ఫైబర్‎నెట్ ఉపయోగించడం యొక్క ప్రాథమిక ప్రయోజనాలలో ఒకటి విశ్వసనీయత. ఇతర ఐఎస్‎పిలు వేగాన్ని అందించడానికి కష్టపడుతున్న ప్రాంతాలలో కూడా ఈ కనెక్షన్ నమ్మదగినది మరియు స్థిరమైనది. కనెక్షన్‎కు 24 గంటల కస్టమర్ సపోర్ట్ మరియు టెక్నికల్ హెల్ప్ కూడా ఉంటుంది. కాబట్టి వినియోగదారులు ఏవైనా సమస్యలు ఉంటే యాక్ట్ వారు వాటిని చూసుకుంటారని నిర్ధారించుకోవచ్చు.

ఆకర్షణీయమైన ఆఫర్లు

పన్నెండు నెలల ఫైబర్ బ్రాడ్‎బ్యాండ్ ప్లాన్‎పై రెండు నెలలు ఉచితం, స్థిరమైన వైఫై స్పీడ్ కోసం ఉచిత వైఫై రూటర్ మరియు అదనపు ఖర్చు లేకుండా కాంప్లిమెంటరీ నెట్‎ఫ్లిక్స్ సబ్‎స్క్రిప్షన్ వంటి ఆకర్షణీయమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లను యాక్ట్ తరచుగా అందిస్తుంది. ఇవి యాక్ట్ ఫైబర్‎నెట్‎ను మరింత ఆకర్షణీయమైన ఎంపికగా చేస్తాయి.

యాక్ట్ ఫైబర్‎నెట్ కనెక్షన్‎ల వల్ల లాభాలు

యాక్ట్ ఫైబర్‎నెట్‎ను ఎంచుకోవడం వల్ల కూడా అనేక లాభాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడండి:

నమ్మశక్యం కాని వేగం

 1 జీబీపీఎస్ ప్లాన్లతో యాక్ట్ ఫైబర్‎నెట్ భారతదేశంలో అత్యధిక ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. ఇది అంతరాయం లేని వేగంతో దూసుకెళ్లేలా చేస్తుంది. కాబట్టి వినియోగదారులు అంతరాయం లేని స్ట్రీమింగ్ మరియు డౌన్లోడ్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.

అత్యాధునిక ఫైబర్ టెక్నాలజీ

యాక్ట్ ఫైబర్‎నెట్ అత్యాధునిక ఫైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది వినియోగదారులకు ఉత్తమ వేగం మరియు నమ్మదగిన కనెక్షన్‎ లభిస్తుందని నిర్ధారిస్తుంది. ఏ సమయంలోనైనా ఎటువంటి బఫరింగ్ లేదా నెట్ నెమ్మదించకుండా వేగవంతమైన నెట్ అందించేందుకు హామీ ఇస్తుంది.

సమాన డౌన్లోడ్ మరియు అప్లోడ్ వేగం

చాలా వరకు ఐఎస్‎పి ప్రొవైడర్లు సమానంగా లేని వేగాలను అందిస్తారు (అప్లోడ్ తక్కువగా, డౌన్లోడ్ వేగం ఎక్కువగా). ఎక్కువ డేటాను అప్లోడ్ చేయాల్సిన యూజర్లకు ఇది అసౌకర్యంగా ఉంటుంది. అయితే యాక్ట్ ఫైబర్‎నెట్తో డౌన్లోడ్ మరియు అప్లోడ్ వేగం సమానంగా ఉంటుంది. ఇది వినియోగదారుడు ఎంచుకున్న స్పీడ్ ప్లాన్‎పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందువల్ల అన్ని రకాల వినియోగదారులు యాక్ట్ కనెక్షన్‎తో గొప్ప అనుభవాన్ని పొందవచ్చు.

జీరో టచ్ ఇన్‌స్టాలేషన్

ప్రస్తుత పరిస్థితుల్లో (కొన్నాళ్ల క్రితం వేధించిన కోవిడ్ వల్ల) సామాజిక దూరానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. జీరో టచ్ ఇన్‎స్టలేషన్ ప్రక్రియను అందించడం ద్వారా యాక్ట్ దీనిని పరిగణనలోకి తీసుకుంటుంది. అంటే ఇన్‎స్టలేషన్ కోసం వచ్చే టెక్నీషియన్లు యూజర్లు లేదా వారి ఇళ్లలోని ఉపరితలాలతో కాంటాక్ట్ అవ్వరు.

24*7 కస్టమర్ సపోర్ట్

యాక్ట్ ఫైబర్‎నెట్ 24 గంటలూ కస్టమర్ సర్వీస్, టెక్నికల్ అసిస్టెన్స్ అందిస్తుంది. అంటే యూజర్లు తమ కనెక్షన్లో ఏవైనా సమస్యలు తలెత్తితే పగలు, రాత్రి ఏ సమయంలోనైనా సహాయం పొందవచ్చు. యాక్ట్ యొక్క కస్టమర్ సపోర్ట్ గురించి మరింత తెలుసుకోవడం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

గుర్తింపు పొందిన అవార్డు విజేత

యాక్ట్ ఫైబర్‎నెట్ భారతదేశంలోని ఉత్తమ బ్రాడ్‎బ్యాండ్ ప్రొవైడర్లలో ఒకటి. వీటి వల్ల ద్వారా ఉత్తమ బ్రాండ్ మరియు మోస్ట్ ఐకానిక్, ఊక్లా ద్వారా ఢిల్లీ యొక్క వేగవంతమైన వైర్డ్ బ్రాడ్‎బ్యాండ్ మరియు బెంగళూరులో స్ట్రీమింగ్ కోసం ఉత్తమ బ్రాడ్‎బ్యాండ్ వంటి అనేక నాణ్యత అవార్డులతో గుర్తింపు పొందింది. ది హిందూ, ది ఇండియన్ ఎక్స్‎ప్రెస్, హిందుస్తాన్ టైమ్స్ వంటి భారతదేశంలోని అనేక ప్రముఖ వార్తాపత్రికలలో ఇది ప్రచురితమైంది.

యాక్ట్ ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్‎బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ పొందడం ఎలా?

కొత్త యాక్ట్ కనెక్షన్ పొందే ప్రక్రియ చాలా ఇబ్బంది లేకుండా మరియు సరళంగా ఉంటుంది. దశల వారీ ప్రక్రియను ఇక్కడ చూడండి:

దశ 1: యాక్ట్ వెబ్‌సైట్‌‎ను సందర్శించండి.

దశ 2: యూజర్లు తమ ప్రాంతంలో అందుబాటులో ఉన్న ప్లాన్లను కనుగొనడానికి ఇచ్చిన ఆప్షన్ల నుండి వారి లొకేషన్‎ని ఎంచుకోండి. ఒకవేళ లొకేషన్ జాబితాలో లేనట్లయితే, ఆ ప్రాంతంలో యాక్ట్ ఫైబర్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి వారి లొకేషన్‎ని నమోదు చేయవచ్చు.

దశ 3: వారికి బాగా సరిపోయే ప్లాన్ ఎంచుకోండి. రెసిడెన్షియల్ కస్టమర్లు బ్రాడ్‎బ్యాండ్ ప్లాన్లను ఇక్కడ తెలుసుకోవచ్చు. వాణిజ్య వినియోగదారులు బిజినెస్ బ్రాడ్‎బ్యాండ్ గురించి వివరాలను ఇక్కడ చూడవచ్చు.

దశ 4: వారు ప్లాన్లను ఎంచుకున్న తర్వాత వారు వారి వివరాలను నమోదు చేయడం ద్వారా ప్రక్రియను కొనసాగించవచ్చు.

దశ 5: తరువాత బడ్జెట్‎కు తగిన ప్లాన్‎ని ఎంచుకోవాలి. ఆఫర్‎ను ఎంచుకోవాలి, ఆర్డర్‎ని ధృవీకరించుకోవాలి మరియు డబ్బు చెల్లించాలి.

దశ 6: చివరగా ఇన్‎స్టలేషన్‎కు సంబంధించిన వివరాలతో యాక్ట్ టీమ్ చేరుకునే వరకు వేచి ఉండండి.

ప్రత్యామ్నాయంగా యూజర్లు హోమ్ పేజీలోని న్యూ కనెక్షన్ ట్యాబ్‌పై నేరుగా క్లిక్ చేసి ఇక్కడ తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

యాక్ట్ ద్వారా ఇతర ఆఫర్లు

బ్రాడ్‎బ్యాండ్ సేవలతో పాటు, వినియోగదారులు తమ ఫైబర్ బ్రాడ్‎బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లను సద్వినియోగం చేసుకోవడానికి సహాయపడే ఇతర ఆఫర్ల శ్రేణిని కూడా యాక్ట్ అందిస్తుంది. ఇందులో ఇవి ఉన్నాయి:

యాక్ట్ హోమ్ కెమెరా

ఇది అదనపు భద్రత కోసం వినియోగదారులు తమ ఇళ్లలో ఇన్‎స్టాల్ చేయగల వై-ఫై ఎనేబుల్డ్ సెక్యూరిటీ కెమెరా. ఏ యాక్ట్ కనెక్షన్‎లోనైనా కెమెరా సాఫీగా నడుస్తుంది మరియు యాప్ ద్వారా రిమోట్‎గా యాక్సెస్ చేయవచ్చు.

యాక్ట్ డిజిటల్ టీవీ

ఇంటర్నెట్‎తో పాటు యాక్ట్ డిజిటల్ టీవీతో 200 ఛానళ్లకు యాక్సెస్ పొందొచ్చు. ఇందులో వార్తలు, క్రీడలు, వినోదం మరియు మరెన్నో ఉన్నాయి.

చివరగా

విశ్వసనీయమైన మరియు సురక్షితమైన కనెక్షన్ కోసం చూస్తున్న వినియోగదారులకు యాక్ట్ ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్‎బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేక ప్రయోజనాలు మరియు లాభాలను అందిస్తుంది. సమాన డౌన్లోడ్ మరియు అప్లోడ్ వేగం, జీరో-టచ్ ఇన్‎స్టలేషన్ ప్రక్రియ, 24*7 కస్టమర్ సర్వీస్, యాక్ట్ హోమ్ కెమెరా మరియు డిజిటల్ టీవీ వంటి ఇతర ఆఫర్లతో, వినియోగదారులు వారి కనెక్షన్ నుండి ఎక్కువ పొందవచ్చు. తమ ప్రాంతంలో లభ్యమయ్యే ప్లాన్లు మరియు సేవలను తనిఖీ చేయడానికి, వినియోగదారులు యాక్ట్ వెబ్‎సైట్‎ను సందర్శించాలి మరియు పైన పేర్కొన్న దశలను అనుసరించాలి.

ఏవైనా సందేహాలు లేదా అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి మమ్మల్ని చేరుకోవడం గురించి ఏమాత్రం సంకోచించకండి.

  • Share

Be Part Of Our Network

Related Articles

Most Read Articles

PAY BILL

4 easy ways to pay ACT Fibernet bill online

Monday, Dec 04, 2017 · 2 Mins
1466070

WI-FI

Simple Ways to Secure Your Wi-Fi

Wednesday, May 16, 2018 · 10 mins
542145
Read something you liked?

Find the perfect internet plan for you!

Chat How may i help you?