WI-FI CONNECTION

ఇంట్లో వాడేందుకు అన్​లిమిటెడ్ వైఫై ప్లాన్లు

Monday, Feb 28, 2022 · 15 mins

91

ఇంట్లో వాడేందుకు అత్యుత్తమ అన్​లిమిటెడ్ వై-ఫై ప్లాన్లు

WI-FI కనెక్షన్​

మీ ఇంటి కోసం ACT ఫైబర్​నెట్​ అందిస్తున్న అన్​లిమిటెడ్​ WI-FI ప్లాన్స్​

ఇంటికి కానీ, ఆఫీసులో కానీ ఎవరైనా సరే నెట్ కనెక్షన్​ తీసుకోవాలనుకున్నపుడు ప్రతి ఒక్కరూ ఆలోచించేది స్పీడ్​ గురించే. ACT ఫైబర్​నెట్​ స్మార్ట్​ ఫైబర్​ టెక్నాలజీతో తయారు చేయబడింది. హైదరాబాద్​, చెన్నై వంటి నగరాల్లో నివసించేవారికి ACT ఫైబర్​నెట్​ అద్భుతమైన నెట్​ స్పీడ్​ను అందిస్తుంది. ACT ఫైబర్​నెట్​ వైర్​డ్​ బ్రాడ్​బాండ్​ సర్వీసుల్లో చాలా వేగవంతమైనది. బెంగళూరు, జైపూర్​, కోయంబత్తూరు వంటి నగరాల్లో కూడా ACT తన సేవలను అందిస్తోంది.

 

మీరు ఎంత డేటాను ఉపయోగిస్తారు?

సాధారణంగా రోజుకు మీకు ఎంత డేటా అవసరమవుతుందో ఇక్కడ ఇచ్చాం. ఈ గణాంకాలు కేవలం అంచనా మాత్రమే. మీరు రోజువారీగా ఉపయోగించే డేటా అంతకన్నా ఎక్కువగా ఉండవచ్చు. లేదా తక్కువగా ఉండవచ్చు. డేటా వినియోగం అనేది మనం వాడే సైట్లను బట్టి మారుతూ ఉంటుంది.

 

మీకు అన్​లిమిటెడ్​ డేటా ప్లాన్స్​ ఎందుకు అవసరం?

ప్రతి ఒక్కరూ అన్​లిమిటెడ్​ డేటా ప్లాన్​ను ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం అదనపు చార్జీలు​. ఒకవేళ మీ డేటా ప్లాన్​ పరిమితంగా ఉండి, మీరు దాన్ని పూర్తిగా వాడేసిన తర్వాత ఇంకా వాడాల్సి వస్తే అదనపు చార్జీల బాదుడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చార్జీల నుంచి అన్​లిమిటెడ్​ డేటా ప్లాన్​ మిమ్మల్ని కాపాడుతుంది.

 

డేటా చార్జీలు అనేవి చాలా ముఖ్యం. మీరు ఒక వేళ లిమిటెడ్​ డేటా ప్లాన్​ను ఎంచుకుంటే ప్లాన్​ డేటా అయిపోయిన తర్వాత అదనంగా వాడిన డేటాకు అధికంగా చార్జీలు వసూలు చేస్తారు. ఈ చార్జీలను చూసి మీరు షాక్​ అవుతారు.

 

హైదరాబాద్​లో అందుబాటులో ఉన్న ACT ఫైబర్​నెట్​ అన్​లిమిటెడ్​ ప్లాన్స్​..

A-Max 1325 ప్లాన్​, 1999 ప్లాన్​ మనకు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు నమ్మశక్యం కాని రీతిలో రూ. 1,325, రూ. 1,999 ఉంటాయి. A-Max 1325 ప్లాన్​లో 300 Mbps, 1999 ప్లాన్​లో 400 Mbps స్పీడ్ వస్తుంది. ఈ రెండు అన్​లిమిటెడ్​ డేటా ప్లాన్స్​. అంటే వీటితో మనకు అన్​లిమిటెడ్​ డేటా లభిస్తుంది. ACT ఫైబర్​నెట్​ ద్వారా స్పీడ్​ను పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది.  

 

A-Max 500 బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్​ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్​లో నెలవారీగా చార్జీలు వసూలు చేస్తారు. రూ. 500 లకు 500GB డేటా లభిస్తుంది. డేటా స్పీడ్​ 40 Mbps ఉంటుంది. డేటా కోటా పూర్తయిన తర్వాత ఇంటర్​నెట్​ స్పీడ్​ 512 Kbpsకి తగ్గించబడుతుంది. ఎంతో పాపులర్​ అయిన A-Max 700 బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్​ కూడా ACTలో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్​లో డేటా స్పీడ్​ 75 Mbpsగా వస్తుంది. FUP (ఫెయిర్​ యూసేజ్​ పాలసీ) 1TBగా ఉంటుంది. FUP పూర్తయిన తర్వాత స్పీడ్​ 1 Mbpsకి తగ్గించచబడుతుంది. అదేవిధంగా A-Max 1075 ప్లాన్​లో 150 Mbps స్పీడ్​ లభిస్తుంది. FUP లిమిట్​ 2TBగా ఉంటుంది. FUP లిమిట్​ ముగిసిన తర్వాత స్పీడ్​ 3Mbpsకి కుదించబడుతుంది.

చెన్నై నగరంలో ACT ఫైబర్​నెట్​ అందిస్తున్న అన్​లిమిటెడ్​ ప్లాన్స్​

ACT బేసిక్​, ACT బ్లేజ్​, ACT బ్లాస్ట్​ ప్రోమో, ACT స్టార్మ్​​, ACT లైటెనింగ్​ ప్లాన్స్​ నమ్మశక్యం కాని కొత్త స్పీడ్స్​కు అప్​గ్రేడ్​ చేయబడ్డాయి. అంతేకాకుండా ఇవి అన్​లిమిటెడ్​ FUPతో మనకు అందుబాటులో ఉన్నాయి. నెలవారీ ప్లాన్స్​ కూడా అందుబాటులో ఉన్నాయి. 60Mbps డేటా స్పీడ్​ వచ్చే నెలవారీ ప్లాన్​ ఎంచుకుంటే నెలకు రూ. 820 చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా ACT బ్లేజ్​ ప్లాన్​కు మనం నెలకు రూ. 1,020 కట్టాలి. ఈ ప్లాన్​లో డౌన్​లోడ్​ స్పీడ్​ 125Mbpsగా ఉంటుంది. ACT బ్లాస్ట్​ ప్రోమో ప్లాన్​ను ఎంచుకుంటే నెలకు రూ. 1,075 కట్టాల్సి ఉంటుంది. ఈ ప్లాన్​లో డౌన్​లోడ్​ స్పీడ్​ 200Mbpsగా ఉంటుంది. అంతేకాకుండా మనం ACT స్టార్మ్​​ ప్లాన్​ను గనుక ఎంచుకుంటే నెలకు రూ. 1,125 కట్టాల్సి వస్తుంది. ఈ ప్లాన్​ 250Mbps స్పీడ్​ను ఆఫర్​ చేస్తుంది. ACT లైటె​నింగ్​ ప్లాన్​ ఎంపిక చేసుకుంటే నెలకు రూ. 1,325 ఉంటుంది. ఇది నమ్మశక్యం కాని 350Mbps స్పీడ్​ను కలిగి ఉంటుంది.

 

బెంగళూరులో ACT ఫైబర్​నెట్​ అన్​లిమిటెడ్​ ప్లాన్స్​..

ACT ఫైబర్​నెట్​ తన సేవలను బెంగళూరులో కూడా అందిస్తోంది. బెంగళూరులో ACT ఫైబర్​నెట్​ ప్లాన్​ వివరాలను పరిశీలిస్తే.. ఇక్కడ మనకు 10 రకాల ప్లాన్స్​ అందుబాటులో ఉన్నాయి. నెలకు రూ. 710 చవకైన ప్లాన్​తో పాటు నెలకు రూ. 5,999 ల విలువైన ప్లాన్​ కూడా అందుబాటులో ఉంది. అన్​లిమిటెడ్​ ప్లాన్​ కావాలనుకుంటే 1425 డాలర్ల చార్జి​ ఉంటుంది. ఈ ప్లాన్​లో మనకు 250 మెగాబిట్స్​ పర్​ సెకండ్​ స్పీడ్​ వస్తుంది. ఈ ప్యాకేజిలో నెలకు 3,300GB డేటాను వాడుకునే సౌలభ్యం ఉంటుంది.

ఢిల్లీలో ACT ఫైబర్​నెట్​ అన్​లిమిటెడ్​ ప్లాన్ల వివరాలు

ఢిల్లీలో ACT  ఫైబర్​నెట్​ ప్రస్తుతం మూడు బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్లను ఆఫర్​ చేస్తుంది. ప్రతీ ప్లాన్​ హై స్పీడ్​ ఇంటర్​నెట్​ను కలిగి ఉంటుంది. ACT  ఫైబర్​నెట్​ ఢిల్లీ బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్ల వివరాలు పూర్తిగా తెలుసుకుంటే.. ACT సిల్వర్​ ప్రోమో, ACT ప్లాటినమ్​ ప్రోమో, ACT డైమండ్​ ప్రోమో అనే మూడు ప్లాన్లు​ అందుబాటులో ఉన్నాయి. ACT సిల్వర్​ ప్రోమో ప్లాన్​లో 150 Mbps డేటా స్పీడ్​ వస్తుంది. దీనికి రూ. 799 చెల్లించాలి. ఢిల్లీలో మనకు లభించే ACT ప్లాన్స్​లో ఇదే చవకైనది. ఇక ACT ప్లాటినమ్​ ప్రోమో ప్లాన్​లో సెకను​కు 250 మెగాబిట్స్​ డేటా వస్తుంది. ఈ ప్లాన్​కు రూ. 1,049 చెల్లించాలి. ఇక చివరగా ACT డైమండ్​ ప్రోమో ప్లాన్​లో సెకనుకు 300 మెగాబిట్స్​ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్​ రూ. 1,349 లకు లభిస్తుంది.

ACT ఫైబర్​నెట్​ హైదరాబాద్​, చెన్నై, బెంగళూరులో సెకనుకు 1 గిగాబిట్​ స్పీడ్​ను సైతం ఆఫర్​ చేస్తోంది. మరిన్ని ACT బ్రాడ్​బ్యాండ్​ ప్లాన్లు కింద అందుబాటులో ఉన్నాయి.

Read tips and tricks to increase your wifi speed here

  • Share

Be Part Of Our Network

Related Articles

Most Read Articles

PAY BILL

4 easy ways to pay ACT Fibernet bill online

Monday, Dec 04, 2017 · 2 Mins
1240442

WI-FI

Simple Ways to Secure Your Wi-Fi

Wednesday, May 16, 2018 · 10 mins
532922
Read something you liked?

Find the perfect internet plan for you!